SPORTS

దమ్మున్న ఆట‌గాళ్ల‌తో పంజాబ్ కింగ్స్

Share it with your family & friends

ఎక్కువ ఖ‌ర్చు చేసిన ప్రీతి జింటా

పంజాబ్ – పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తుది ఆట‌గాళ్ల జాబితా పూర్త‌యింది. జెడ్డా వేదిక‌గా జ‌రిగిన వేలం పాట ముగిసింది. భారీ ఖ‌ర్చు చేసింది పంజాబ్ ఫ్రాంచైజీ కో ఓన‌ర్, ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింటా. ఈ సీజ‌న్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను విజేత‌గా నిలప‌డంలో కీల‌క పాత్ర పోషించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ ను రూ. 26.75 కోట్ల‌కు తీసుకుంది. ఇది రికార్డ్ . ఐపీఎల్ లో రిష‌బ్ పంత్ రూ. 27 కోట్ల‌కు అమ్ముడు పోయాడు.

అయ్య‌ర్ తో పాటు యుజ్వేంద్ర చాహ‌ల్ ను రూ. 18 కోట్లు పెట్టి తీసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. అంతే కాకుండా పేస‌ర్ అర్ష్ దీప్ సింగ్ ను కూడా అంతే ధ‌ర‌కు తీసుకుంది. ఈ ముగ్గురికే 63కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్.

ఇక మిగ‌తా ఆట‌గాళ్ల ప‌రంగా చూస్తే మార్క‌స్ స్టోయినిస్ పై రూ. 11 కోట్లు ఖ‌ర్చు చేసింది. గ్లెన్ మాక్స్ వెల్ ను రూ. 4.2 కోట్లు, మార్కో జాన్సెన్ ను రూ. 7 కోట్లు, నేహాల్ వ‌ధేరా ను రూ. 4.2 కోట్లు, లాకీ ఫెర్గుస‌న్ కు రూ. 2 కోట్ల‌కు తీసుకుంది.

వీరితో పాటు జోష్ ఇంగ్లిష్ ను రూ. 2.2 కోట్లు, వైశాఖ్ విజ‌య కుమార్ ను రూ. 1.8 కోట్లు, య‌శ్ ఠాకూర్ ను రూ. 1.6 కోట్లు, ఆరోన్ హార్డీని రూ. 1.25 కోట్లు, అజ్మ‌తుల్లాను రూ. 2.4 కోట్లు, ప్రియాంశ్ ఆర్యాను రూ. 3.8 కోట్లు, విష్ణు వినోద్ ను రూ. 95 ల‌క్ష‌లు, జేవియ‌ర్ బార్జ్ లెట్ ను రూ. 80 ల‌క్ష‌లు, కుల్దీప్ సేన్ ను రూ. 80 ల‌క్ష‌లు, పైలా అవినాష్ ను రూ. 30 ల‌క్ష‌లు, సూర్యాంశ్ షెడ్జ్ ను రూ. 30 ల‌క్ష‌లు, ముషీర్ ఖాన్ ను రూ. 30 ల‌క్ష‌లు, హ‌ర్నూర్ ప‌న్ను ను రూ. 30 ల‌క్ష‌ల‌కు తీసుకుంది.