కీలక ఆటగాళ్లతో కేకేఆర్
ఐపీఎల్ ఫైనల్ జట్టు ఇదే
కోల్ కతా – జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం 2025కి సంబంధించి ముగిసింది. వెంకటేశ్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది తన కోసం. ఈ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్. గెలిచిన జట్టుకు స్కిప్పర్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కైవసం చేసుకుంది.
అయ్యర్ ను రిటైన్ చేసుకోగా క్వింటన్ డికాక్ , అన్రిచ్ నార్టే దక్షిణాఫ్రికా దిగ్గజాలను కొనుగోలు చేసింది. రఘ/వంశీ, రహ్మనుల్లా గుర్బాజ్ ను కూడా తిరిగి తీసుకుంది. రూ. 13 కోట్లకు రింకూ సింగ్ ను , రూ. 12 కోట్లకు వరుణ్ చక్రవర్తిని, సునీల్ నరైన్ ను రూ. 12 కోట్లకు, ఆండ్రీ రస్సెల్ ను రూ. 12 కోట్లకు, హర్షిత్ రాణాను రూ. 4 కోట్లకు, రమణ్ దీప్ సింగ్ ను రూ. 4 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ తిరిగి తన వద్దే ఉంచుకుంది.
క్వింటన్ డికాక్ ను రూ. 3.60 కోట్లు, గుర్బాజ్ ను రూ. 2 కోట్లు, నార్ట్జేను రూ. 6.50 కోట్లు, రఘువంశీని రూ. 3 కోట్లకు, వైభవ్ అరోరాను రూ. 1.80 కోట్లు, మయాంక్ మార్కండేను రూ. 30 లక్షలకు, రోవ్ మన్ పావెల్ ను రూ. 1.50 కోట్లకు, మనీష్ పాండేను రూ. 75 లక్షలకు, జాన్సన్ ను రూ. 2.80 కోట్లకు, సిసోడియాను రూ. 30 లక్షలకు, అజింక్యా రహానేకు రూ. 1.50 కోట్లకు, అనుకుల్ రాయ్ ను రూ. 40 లక్షలకు, మొయిన్ అలీని రూ. 2 కోట్లకు, ఉమ్రాన్ మాలిక్ ను రూ. 75 లక్షలకు చేజిక్కించుకుంది కోల్ కతా నైట్ రైడర్స్.