SPORTS

పంత్ రాక‌తో ల‌క్నో క‌ళ‌క‌ళ

Share it with your family & friends

ఈసారి ఐపీఎల్ క‌ప్ పై ఫోక‌స్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – జెడ్డా వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం పాట ముగిసింది. ఎవ‌రూ ఊహించ‌ని ధ‌ర‌కు కొనుగోలు చేసి చ‌రిత్ర సృష్టించింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యాజ‌మాన్యం. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో ఒక దేశీయ ఆట‌గాడికి భారీ మొత్తం చెల్లించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో సుదీర్ఘ కాలం బంధం కొన‌సాగించిన రిష‌బ్ పంత్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్ల‌కు తీసుకుంది. ఇది రికార్డ్. ఏ విదేశీ , దేశీయ ఆట‌గాళ్ల‌కు ఇంత భారీ మొత్తం రాలేదు. పంత్ తో పాటు 25 వేలు త‌క్కువ‌గా అమ్ముడు పోయాడు శ్రేయ‌స్ అయ్య‌ర్. త‌న‌ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. రూ. 26.75 కోట్ల‌కు చేజిక్కించింది. అత్యంత ఎక్కువ ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్ల జాబితాలో అయ్య‌ర్ రెండో ఆట‌గాడు కావ‌డం గమ‌నార్హం.

ఇక ఫైన‌ల్ జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇలా ఉంది ఎల్ఎస్జీ. రిష‌బ్ పంత్ స్కిప్ప‌ర్ కావ‌డం ఖాయంగా తోస్తోంది.
డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ , నికోలస్ పూరన్ , మార్ష్ , అవేష్ ఖాన్ , మ‌యాంక్ యాద‌వ్ , మోషిన్ ఖాన్ , ర‌వి బిష్ణోయ్ , అబ్దుల్ స‌మ‌ద్, ఆర్య‌న్ జుయ‌ల్, ఆకాష్ దీప్ , హిమ్మ‌త్ సింగ్ , ఎం. సిద్దార్థ్, దిగ్వేష్ సింగ్ , షాబాజ్ అహ్మ‌ద్ , షాబాజ్ అహ్మ‌ద్ , ష‌మ‌ర్ జోసెఫ్ , యువ‌రాజ్ యాద‌వ్ , చౌద‌రి, మాథ్యూ బ్రిట్కే, అర్షిన్ కుల‌కర్ణి, రాజ‌వ‌ర్ద‌న్ , ఆకాష్ సింగ్ ఉన్నారు.