SPORTS

అత్య‌ధిక ధ‌ర‌కు భార‌తీయ ఆట‌గాళ్లు

Share it with your family & friends

రూ. 18 కోట్ల‌కు పైగా 5 గురు మ‌నోళ్లే

హైద‌రాబాద్ – ఐపీఎల్ వేలం పాట ముగిసింది. ఈసారి జ‌రిగిన వేలం పాట చ‌రిత్ర సృష్టించింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. 182 మంది ఆట‌గాళ్ల కోసం రూ. 639 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశాయి. ఇది రికార్డ్. విచిత్రం ఏమిటంటే గ‌తంలో జ‌రిగే వేలం పాట‌ల్లో ఎక్కువ‌గా విదేశీ ఆట‌గాళ్ల‌కు డిమాండ్ ఉండేది. పాట్ క‌మిన్స్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌డం విశేషం. కానీ సీన్ మారింది. దేశానికి చెందిన మ‌న ఆట‌గాళ్లే ఈసారి దుమ్ము రేపారు ధ‌ర ప‌ల‌క‌డంలో.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఐదుగురు భార‌తీయ క్రికెట‌ర్లు రూ. 18 కోట్ల‌కు పైగా అమ్ముడు పోయారు. ఇది ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే కాదు భార‌త దేశ క్రికెట్ హిస్ట‌రీలో రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ క్యాపిటిల్స్ కు 9 ఏళ్ల పాటు ఆడిన రిష‌బ్ పంత్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లు పెట్టి తీసుకుంది.

ఇక ఈఏడాది జ‌రిగిన ఐపీఎల్ మెగా టోర్నీలో విజేత‌గా నిలిపిన కేకేఆర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల‌కు తీసుకుంది. అంతే కాకుండా అర్ష్ దీప్ సింగ్ తో పాటు యుజ్వేంద్ర చాహ‌ల్ ను రూ. 18 కోట్ల చొప్పున ఇద్ద‌రినీ కైవ‌సం చేసుకుంది. ఇక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తిరిగి వెంక‌టేశ్ అయ్య‌ర్ ను తీసుకుంది. త‌న‌ను రూ. 23.75 కోట్ల‌కు చేజిక్కించుకుంది. మొత్తంగా పంత్, అయ్య‌ర్, సింగ్ , చాహ‌ల్ , వెంక‌టేశ్ రికార్డ్ బ్రేక్ చేశారు.