సీఎంతో ఒప్పో ఎండీ తస్లీమ్ అరీఫ్ భేటీ
చంద్రబాబును కలవడం ఆనందంగా ఉంది
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో మేనేజింగ్ డైరెక్టర్ తస్లీమ్ ఆరిఫ్. ఆయన ప్రస్తుతం ఒప్పో కంపెనీని మార్కెట్ పరంగా, బ్రాండింగ్ పరంగా ముందుకు తీసుకు వెళ్లే పనిలో బిజీగా ఉన్నారు. మోస్ట్ పాపులర్ ఎండీగా కూడా గుర్తింపు పొందారు.
ఒప్పోలో పరిశోధన, అభివృద్ది (ఆర్ అండ్ డి) ఇండియా విభాగానికి వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు తస్లీమ్ ఆరిఫ్. ఆయన గతంలో ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ శాంసంగ్ కు ఇండియా హెడ్ గా కూడా పని చేశారు. భారత దేశంలో టాప్ 50 లీడర్లలో ఒకరిగా పురస్కారం పొందారు. జీసీసీ ఆర్కిటెక్ట్ గా, టెక్ స్టార్టప్ ఇన్వెస్టర్ గా పని చేసిన అనుభవం ఉంది తస్లీమ్ ఆరీఫ్ కు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న టెక్నాలజీ పరంగా మార్పులను ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ , రీసెర్చ్ , అభివృద్ది, మార్కెటింగ్ , నైపుణ్యాభివృద్ది, తదితర కీలక అంశాల గురించి చర్చించామని తెలిపారు తస్లీమ్ అరీఫ్.
ప్రధానంగా ఏఐ, స్మార్ట్ పరికరాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారని, తాము అందుకు అనుగుణంగా సిద్దంగా ఉన్నామని సీఎంకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు ఒప్పో మేనేజింగ్ డైరెక్టర్. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పో కలిసి పని చేస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ గొప్పదని ప్రశంసించారు తస్లీమ్ అరీఫ్. ఏపీ సర్కార్ కు చెక్కును అందజేశారు ఎండీ.