స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు పాటిల్ కలిశారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు చేసేందుకు మార్గమధ్యంలో మున్ననూర్ (అమ్రాబాద్ మండలం) లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషనర్ కు ఉత్సవ పోలీసు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. శ్రీశైలంలో స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా.
అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ స్వామి, అమ్మ వార్లకు పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో మరిచి పోలేని అనుభూతి చెందానని చెప్పారు. సాక్షాత్తు ఆ పరమ శివుడు, శ్రీ భ్రమరాంబికా అమ్మ వారిని దర్శించు కుంటానని తాను కలలో కూడా అనుకోలేదన్నారు. పూర్తిగా కొండల్లో ఆధ్యాత్మికతకు ఆలవాలంగా శ్రీశైలం పుణ్య క్షేత్రం ఉండడం మరింత ఆహ్లాదాన్ని, అంతకు మించిన సంతోషాన్ని తాము పొందామని చెప్పారు జ్ఞానేష్ కుమార్.





