అదానీ ఒప్పందంపై పవన్ కామెంట్స్
గత సర్కార్ హయాంలో అవకతవకలు
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ వ్యవహారంపై స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. అదానీకి చెందిన సోలార్ ప్రాజెక్టు విషయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే అంతర్జాతీయ పరంగా అదానీ అంశం రాద్దాంతం చోటు చేసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇంకా తనకు సమాచారం అందలేదని ,దీని గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం.
మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు కొణిదల పవన్ కళ్యాణ్. ఆ అధ్యయనం తర్వాత వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అప్పటి వరకు అదానీ వ్యవహారం గురించి తాను మాట్లాడటం మంచిది కాదని పేర్కొన్నారు.