NEWSNATIONAL

మోదీ ప్ర‌భుత్వం ఓట్ల‌కు గాలం

Share it with your family & friends

బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఊర‌ట

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఎలాగైనా మూడోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని మోదీ డిసైడ్ అయ్యారు. ఈ మేర‌కు అటు భ‌క్తిని ఇటు ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే స‌ర్వ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ధార‌ద‌త్తం చేశారు. త‌మ అనుయాయుల‌కు క‌ట్ట‌బెట్టారు.

ఎన్నో ఏళ్లుగా స‌మ‌స్య‌గా మారిన అయోధ్య లో రామాల‌యం పునః ప్రారంభించారు. ఇలా భ‌క్తితో జ‌నాన్ని బురిడీ కొట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ఇక తాజాగా బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింది కేంద్రం. ఇదంతా ఓట్ల‌ను కొల్లగొట్టేలా ఉంద‌ని ఎంపీలు వాపోయారు.

ఇదిలా ఉండ‌గా దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా బ‌డ్జెట్ లో కేటాయింపులు జ‌రిపిన‌ట్లు ప్ర‌క‌టించారు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ . ఏపీకి రూ.9,138 కోట్లు కేటాయించ‌డం విశేషం. ఈ ఏడాది తెలంగాణకు రూ.. 5,071 కోట్ల కేటాయించింది.

ఏపీలో 97 శాతం ట్రాక్స్ కి విద్యుదీకరణ పూర్తి.. 72 స్టేషన్‌లు అమృత్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు నిర్మ‌లా సీతారామ‌న్. ఇక తెలంగాణలో 100 శాతం ఎలక్ట్రిక్ ట్రాక్స్.. 40 అమృత్ స్టేషన్లు తెలంగాణలో నిర్మిస్తున్నామ‌ని తెలిపారు.