5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన గవర్నర్
అమరావతి – ఏపీలో ఇదే ఆఖరి బడ్జెట్ సమావేశం కానుంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 5వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని తెలిపింది.
గవర్నర్ తరపున కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయని పేర్కొన్నారు. మొదటి రోజు ఉభయ సభల (అసెంబ్లీ, శాసన మండలి) ను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నట్లు తెలిపారు అనిల్ కుమార్ సింఘాల్.
శాసన సభ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 6న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది . మొత్తంగా త్వరలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం జనాకర్షక పథకాలను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే నవ రత్నాలు పేరుతో అధికారంలోకి వచ్చారు జగన్ రెడ్డి.