NEWSANDHRA PRADESH

కాంగ్రెస్ నిర్వాకం విజ‌యసాయి ఆగ్ర‌హం

Share it with your family & friends

స‌భా స‌మావేశాలు అడ్డుకుంటే ఎలా..?

ఢిల్లీ – వైఎస్సార్సీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌దే ప‌దే పార్ల‌మెంట్ ను స్తంభింప చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ఇలాగే చేస్తూ పోతే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎంపీలు ఎలా ప్ర‌స్తావిస్తారంటూ నిల‌దీశారు. దీనిపై పార్టీ పెద్ద‌లు పున‌రాలోచించాల‌ని సూచించారు ఎంపీ విజ‌య సాయిరెడ్డి.

పార్లమెంటులో ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక చర్చలపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని తేలి పోయింద‌న్నారు. బదులుగా, వారు బురద జల్లడం, గందరగోళం సృష్టించ‌డం, చర్యలను అడ్డుకోవడంపై దృష్టి పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు విజ‌య సాయి రెడ్డి.

పార్లమెంటును నడపడానికి ప్రతి నిమిషానికి రూ. 2.5 లక్షల ఖ‌ర్చు అవుతోంద‌ని , ఏదైనా అభ్యంత‌రం ఉన్నా లేదా స‌మ‌స్య‌లు ఉంటే ప్ర‌స్తావించేందుక స‌భ‌ను ఉప‌యోగించేలా త‌ప్పా ఇలా ప‌దే ప‌దే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు. దీని వ‌ల్ల ప్ర‌జా ధ‌నం వృధా అవుతోంద‌ని వాపోయారు వైసీపీ ఎంపీ.