పిట్టల్లా రాలి పోతుంటే నిద్ర పోతే ఎలా..?
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ – అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా. లేక ఏం చేస్తోందంటూ సీరియస్ కామెంట్స్ చేసింది తెలంగాణ హైకోర్టు. అధికారులు ఏం చేస్తున్నారు..అసలు ఉన్నారా లేక నిద్ర పోతున్నారా అంటూ ఫైర్ అయ్యింది. నారాయణ పేట జిల్లా మాగనూరు పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రి పాలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక 38 మంది పిల్లలు చని పోయారు. ఇది అత్యంత బాధాకరం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం బాధిత విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
వారం రోజుల్లో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఈవో..ఇంత మంది ఉండీ ఏం లాభమని ప్రశ్నించింది కోర్టు. మీ పిల్లలకైతే ఇలాగే చేస్తారా అంటూ నిలదీసింది. సీజే జస్టిస్ అలోక్ అరాధీ రేవంత్ రెడ్డి సర్కార్ పై భగ్గుమన్నారు. ఈ అంశం పట్ల నిర్లక్ష్యం చేయడం దారుణమని పేర్కొంది. వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామన్న సర్కార్ తరపు న్యాయవాదిపై వార్నింగ్ ఇచ్చింది.