రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి
జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా గుర్తింపు పొందారు తెలంగాణ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ సంక్షోభం పై ఫోకస్ పెట్టారు. ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు. తానే స్వయంగా జేఎంఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు భద్రత కల్పించే విషయంపై దృష్టి సారించారు.
అవినీతి, అక్రమాలకు సంబంధించి సీఎం హేమంత్ సోరేన్ ను అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో సంక్షోభం నెలకొంది. కేంద్ర సర్కార్ వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. దీంతో హైదరాబాద్ కు హుటా హుటిన ఎమ్మెల్యేలను తరలించారు. వీరిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారు ఏఐసీసీ నేతలు. ఈ మేరకు ఎమ్మెల్యేల క్యాంపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరూ పక్క చూపులు చూడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.