NEWSTELANGANA

జ‌ర్న‌లిస్టుల పాసులు పున‌రుద్ద‌రించండి

Share it with your family & friends

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విన్న‌పం

ఢిల్లీ – తెలంగాణ ప్రాంతానికి చెందిన మ‌ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద‌ర్ బుధ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ప్ర‌ధానంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎదుర్కొంటున్న రైల్వే రంగానికి సంబంధించి ప్ర‌స్తావించారు విన‌తిప‌త్రంలో. పలు RUB, ROB పనులు, మేడ్చల్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్ళను నిలుపుదల చేయాలని కోరారు ఈట‌ల రాజేంద‌ర్.

ఇదే స‌మ‌యంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని విన్న‌వించారు. ప‌లు స‌మ‌స్య‌ల‌ను కేంద్ర మంత్రి సావ‌ధానంగా విన్నార‌ని, అన్నింటిని సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్.

అంతే కాకుండా కరోనా సమయంలో విలేకరులకు నిలిపి వేసిన పాసులు పునరుద్ధరించాలని వారిని కోరడం జరిగింద‌న్నారు ఎంపీ.