DEVOTIONAL

బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Share it with your family & friends

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆల‌యంలో

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆల‌యంలో డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ వ‌చ‌నం, ర‌క్షా బంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో దేవరాజులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్బంగా వాహన సేవల వివరాలు వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం జీఈవో వీర బ్ర‌హ్మం.

తేది సమయం – వాహన సేవలు
28.11.2024 ఉ. 9.00 – ఉ.9.30 ధ్వజారోహణము
రాత్రి 7.00 – 9.00 చిన్నశేష వాహనము
29.11.2024 ఉ. 8 – 10 పెద్దశేష వాహనము
రా.7 – 9 హంస వాహనము
30.11.2024 ఉ. 8 – 10 ముత్యపు పందిరి వాహనము
రా. 7- 9 సింహ వాహనము
01.12.24 ఉ. 8 – 10 కల్పవృక్ష వాహనము
రా. 7 – 9 హనుమంత వాహనము
02.12.24 ఉ. 8 – 10 పల్లకి వాహనము
రా. 7 – 9 గజ వాహనము
03.12.24 ఉ. 8 – 10 సర్వభూపాల వాహనము
సా.4.20 – 5.20 స్వర్ణ రథోత్సవము
రా. 7 – 9 గరుడ వాహనము
04.12.24 ఉ. 8 – 10 సూర్య ప్రభ వాహనము
రా. 7 – 9 చంద్రప్రభ వాహనము
05.12.24. ఉ. 8 – 10 రథోత్సవము
రా. 7 – 9 అశ్వవాహనము
06.12.24 ఉ. 7 – 8 పల్లకీ ఉత్సవము
మ.12.15 – 12.20 పంచమి తీర్థము, రాత్రి: ధ్వజావరోహణం
07.12.2024 : సాయంత్రం – పుష్పయాగంతో ముగుస్తాయి ఈ బ్ర‌హ్మోత్స‌వాలు.