మల్లన్న స్వామీ దీవించు..గెలిపించు
వేడుకున్న టీడీపీ నేత లోకేష్..బ్రాహ్మణి
కర్నూలు జిల్లా – ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవాలయాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదరి నారా లోకేష్, ఆయన భార్య హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మణి , తనయుడు తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు స్వాగతం పలికారు.
అంతకు ముందు లోకేష్ కుటుంబం సాక్షి గణపతి దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం కోరిన కోర్కెలు తీర్చే వీర భద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు పూజలు చేశారు. అక్కడి నుంచి నేతలు, అభిమానులు వెంట రాగా లోకేష్ కుటుంబం నేరుగా శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామిని, భ్రమరాంభిక అమ్మ వారిని నమస్కరించుకున్నారు.
వీరితో పూజలు చేయించారు పూజారులు. ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీశైలం దేవస్థానం తరపు నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడారు. స్వామి వారిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తాను చేపట్టిన పాదయాత్రకు అపూర్వమైన రీతిలో స్పందన లభించిందని అన్నారు. అదంతా ఆ వెంకన్న, ఈ మల్లన్న ల ఆశీర్వాద బలం ఉండడం వల్లనే జరిగందన్నారు.