మహాత్ముడికి మరణం లేదు – కవిత
సంఘ సంస్కర్త జ్యోతి బా పూలేకు నివాళి
హైదరాబాద్ – సమాజంలో కుల వివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపె రుగని కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నవంబర్ 28న పూలే వర్దంతి. ఈ సందర్బంగా ఇవాళ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మహోన్నత మానవుడు మహాత్మ జ్యోతి రావు పూలే అని కొనియాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ఈ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహనీయుడిని నిత్యం స్మరించుకునేలా శాసన సభ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు . రాబోయే తరాలకు స్పూర్తి దాయకంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా పూలే అసలు పేరు జ్యోతి రావ్ గోవిందరావు పూలే. ఆయన ఏప్రిల్ 11, 1827లో మహారాష్ట్రలో పుట్టారు. నవంబర్ 28, 1890లో మరణించారు. తన జీవిత కాలమంతా పోరాటం చేశారు. భారత దేశ చరిత్రలో చెరిగి పోని వ్యక్తిగా నిలిచి పోయారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా, కుల వ్యతిరేక సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం తనకు పూలే మార్గదర్శకుడు అని ప్రకటించారు.