NEWSTELANGANA

మ‌హోన్న‌త మాన‌వుడు జ్యోతిబా పూలే

Share it with your family & friends

మాజీ మంత్రి విర‌స‌నోల్ల శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ – సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణ‌గారిన‌ వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్.

సమాజంలో కుల వివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపె రుగని కృషి చేసిన సంఘ సంస్కర్త మ‌హాత్మా జ్యోతిరావు పూలే అని ప్ర‌శంసించారు. న‌వంబ‌ర్ 28న పూలే వ‌ర్దంతి. ఈ సంద‌ర్బంగా ఇవాళ ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మ‌హోన్న‌త మాన‌వుడు మహాత్మ జ్యోతి రావు పూలే అని పేర్కొన్నారు విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్.

ఇదిలా ఉండ‌గా పూలే అస‌లు పేరు జ్యోతి రావ్ గోవింద‌రావు పూలే. ఆయ‌న ఏప్రిల్ 11, 1827లో మ‌హారాష్ట్ర‌లో పుట్టారు. న‌వంబ‌ర్ 28, 1890లో మ‌ర‌ణించారు. త‌న జీవిత కాల‌మంతా పోరాటం చేశారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో చెరిగి పోని వ్య‌క్తిగా నిలిచి పోయారు. సామాజిక కార్య‌క‌ర్త‌గా, ర‌చ‌యిత‌గా, కుల వ్య‌తిరేక సంఘ సంస్క‌ర్త‌గా గుర్తింపు పొందారు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సైతం త‌న‌కు పూలే మార్గ‌ద‌ర్శ‌కుడు అని ప్ర‌క‌టించారు.