సామాజిక సంఘ సంస్కర జ్యోతిబా పూలే
నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్
అమరావతి – స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యా బుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
పార్టీ కార్యాలయంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేశారు జగన్ రెడ్డి. ఈ సందర్బంగా పూలే జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు. సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు జగన్ రెడ్డి. మాజీ సీఎంతో పాటు మాజీ మంత్రి విడుదల రజని తో పాటు ఇతర వైసీపీ నేతలు పూలేకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించాడని ప్రశంసించారు. ఇదిలా ఉండగా పూలే అసలు పేరు జ్యోతి రావ్ గోవిందరావు పూలే. ఆయన ఏప్రిల్ 11, 1827లో మహారాష్ట్రలో పుట్టారు. నవంబర్ 28, 1890లో మరణించారు. తన జీవిత కాలమంతా పోరాటం చేశారు. భారత దేశ చరిత్రలో చెరిగి పోని వ్యక్తిగా నిలిచి పోయారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా, కుల వ్యతిరేక సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం తనకు పూలే మార్గదర్శకుడు అని ప్రకటించారు.