DEVOTIONAL

ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం – ఈవో

Share it with your family & friends

పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామ‌ని వెల్ల‌డి

తిరుప‌తి – తిరుచానూరు లోని శ్రీ పద్మావ‌తి అమ్మ వారి ఆల‌యంలో గురువారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మ వారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని తెలిపారు.

ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మ వారి వాహన సేవలో పాల్గొని, అమ్మ వారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.

శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు.

ఈ సందర్భంగా చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డిఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మ వారికి కానుకగా ఆరు గొడుగులను ఈవోకు అందజేశారు.

ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మ వారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.