దేవరీ ఆలయాన్ని సందర్శించి డీకే
దేశంలోనే పేరు పొందిన పుణ్య క్షేత్రం
జార్ఖండ్ – కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని తమర్ వద్ద ఉన్న చారిత్రాత్మక దేవరీ గుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరితో పాటు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని తాను అమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు డీకే శివకుమార్.
భారతదేశం లోని పురాతన దుర్గా దేవాలయాలలో ఒకటైనదే ఈ ఆలయం, దేవీ మాత అవతారంలో అమ్మ వారికి అంకితం చేయబడింది, ఇది ఈ ప్రాంతంలో మతపరమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. డీకే శివ కుమార్ కు సాదర స్వాగతం పలికారు పూజారులు.
ఇదిలా ఉండగా తాజాగా జార్ఖండ్ లో శాసన సభ ఎన్నికలు ముగిశాయి. ఇండియా కూటమికి చెందిన పార్టీల అభ్యర్థులు మరోసారి గెలుపొందారు. ఇక్కడ కూటమి సర్కార్ కొలువు తీరనుంది. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది గెలుపొందారు. జేఎంఎం మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీకే హాజరయ్యారు.