పదవికి పేరు తీసుకు రావాలి – మంత్రి
సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి – కష్ట పడితే ఏదో ఒక రోజు ఆశించిన ఫలితం దక్కుతుందన్నారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. గురువారం మచిలీపట్నంలో ఎంయూడీఏ (మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ–ముడా) చైర్మన్గా మట్టా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సత్య కుమార్ యాదవ్.
మాజీ మంత్రి, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రసంగించారు.
యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మట్టా ప్రసాద్ కు అవకాశం ఇచ్చారని అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుని, శతాబ్దాల చరిత్ర కలిగిన మచిలీపట్నాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు మంత్రి.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పాలన గాడిలో పడిందన్నారు.