DEVOTIONAL

కృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

Share it with your family & friends

చిన్న శేష వాహ‌నంపై అమ్మ వారు

తిరుప‌తి – తిరుచానూరులో ప్ర‌సిద్ది చెందిన పుణ్య క్షేత్రం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శ్రీ పద్మావతి అమ్మ వారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లన గ్రోవి ధరించి చిన్న‌శేష వాహ‌నంపై అభ‌యం ఇచ్చారు.

మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మ వారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మ వారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగ సిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో జె.శ్యామల రావు దంపతులు, జెఈవోలు వీర‌బ్ర‌హ్మం, గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆల‌య అర్చ‌కులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ చలపతి, శ్రీ సుభాష్, ఏవీఎస్వో సతీష్ కుమార్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

ఉత్స‌వాల సంద‌ర్బంగా ప్ర‌ద‌ర్శించిన క‌ళా రూపాలు ఆక‌ట్టుకున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.