DEVOTIONAL

ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

Share it with your family & friends

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా చిన్నశేష వాహన సేవలో వివిధ రాష్ట్ర‌ల‌ నుండి విచ్చేసిన కళా బృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చాయి.

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 12 కళా బృందాలు, 298 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింప చేశారు.

తమిళనాడు దిండిగల్ కు చెందిన 25 మంది కళాకారులు దిండిగల్ డ్రమ్స్ ను లయ బద్ధంగా వాయిస్తూ భక్తులను పరవశింప చేశారు. చెన్నైకి చెందిన సత్యప్రియ బృందం భరత నాట్యం, కేరళకు చెందిన 30 మంది మహిళ కళాకారులు మోహిని అట్టం నృత్యం ప్రదర్శించారు. హైదరాబాద్ కు చెందిన 22 మంది మహిళలు వివిధ దేవతా మూర్తుల వేషధారణ, భరత నాట్యం భక్తులను ఆకర్షించింది.

అదే విధంగా విశాఖపట్నంకు చెందిన 32 మంది చిన్నారులు, యువతులు మహిషాసుర మర్దిని నృత్య రూపకం, అమలాపురం శ్రీ అయోధ్య సీతారామ కోలాట భజన మండలికి చెందిన 28 మంది మహిళలు కోలాటం, హైదరాబాద్ రఘు రమ్య అకాడమీకి చెందిన 28 మంది కళాకారుల శ్రీనివాస కళ్యాణం, కేరళకు చెందిన కళాకారుల నవదుర్గల వేషధారణ భక్తులను పరవశింప జేసింది.