DEVOTIONAL

బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

Share it with your family & friends

ఘ‌నంగా శ్రీ పద్మావతి అమ్మ వారి ఉత్స‌వాలు

తిరుపతి – శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థాన మండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రంగ రామానుజాచార్యుల ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ మేటూరు బ్రదర్స్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన రాముడు బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన విశాలాక్షి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవలో తిరుపతికి చెందిన మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదే విధంగా తిరుపతిలోని మహతి కళా క్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీ శివ నాట్య కళా నిలయం వారిచే భరత నాట్యం, అన్నమాచార్య కళా మందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వర్లు బృందం కూచిపూడి నృత్యం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద మహబూబ్ న‌గ‌ర్ కు చెందిన చంద్రశేఖర్ బృందం భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి శిల్పారామంలో విజయవాడకు చెందిన ఆనంద్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.