ANDHRA PRADESHNEWS

చంద్ర‌బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్

Share it with your family & friends

టికెట్ ఇవ్వ‌క పోతే ఉరేసుంటారు
విజ‌య‌వాడ – టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌కు క‌చ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందేనంటూ ప్ర‌క‌టించారు. లేక పోతే మా సామాజిక వ‌ర్గానికి చెందిన ముస్లింలంతా ఉరి వేసుకునేందుకు సిద్దంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు.

క‌చ్చితంగా త‌న‌కు విజ‌య‌వాడ వెస్ట్ టికెట్ ఇవ్వాల్సిందేన‌ని ప్ర‌క‌టించారు జ‌లీల్ ఖాన్. ప్ర‌తి ఒక్క‌రు టికెట్ అడుగుతార‌ని, కానీ గెలిచే ద‌మ్ము ధైర్యం ఉండాల‌న్నారు. త‌న‌కు మాత్ర‌మే ఆ స‌త్తా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే.

తాను ముందు నుంచీ పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని, సామాజిక వ‌ర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరారు. లేక‌పోతే పార్టీకి ఇబ్బందులు తప్ప‌వంటూ హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేశారు జ‌లీల్ ఖాన్.

ఇదిలా ఉండ‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.