NEWSTELANGANA

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా దీక్షా దివ‌స్

Share it with your family & friends

33 జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు

ఖ‌మ్మం జిల్లా – బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో శుక్ర‌వారం దీక్షా దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో స్థానిక జిల్లా నాయ‌క‌త్వం ఆధ్వ‌ర్యంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రె్డ్డి.

2009లో న‌వంబ‌ర్ 29న ఇదే రోజు దీక్షా దివ‌స్ జ‌రిగింద‌న్నారు. ఆనాడు ‘తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో ఆమరణ నిరహార దీక్ష చేపట్టగా ఇదే ఖమ్మం ఖిల్లా జైలుకు తరలించడం జరిగింది.

నాటి ఉద్యమ స్మృతులను, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ “దీక్షా దివస్” వేడుకల్లో పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గ‌నుక లేక పోతే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చి ఉండేది కాద‌న్నారు. ఎంద‌రో చేసిన త్యాగాలు, బ‌లిదానాల కార‌ణంగా ఉమ్మ‌డి ఏపీ నుంచి తెలంగాణ ఏర్ప‌డింద‌న్నారు.

మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, చ‌ర్ల‌కోల ల‌క్ష్మా రెడ్డి, కేటీఆర్, క‌ల్వ‌కుంట్ల క‌విత‌, త‌న్నీరు హ‌రీశ్ రావు , త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, త‌దిత‌రులు పాల్గొన్నారు. దీక్షా దివ‌స్ ప్ర‌త్యేక‌త గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.