NEWSANDHRA PRADESH

ఎస్పీ గాయ‌బ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీరియ‌స్

Share it with your family & friends

అధికారులు ఎవ‌రూ మాట విన‌డం లేదు

అమ‌రావ‌తి – కాకినాడ పోర్టును ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాను వ‌స్తున్నాన‌ని తెలిసి కూడా ఎస్పీ లేక పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న సెల‌వుల్లో వెళ్ల‌డం ఏమిట‌ని , ఏదో తేడా కొడుతోంద‌న్నారు . ప‌వ‌న్ వెంట మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నారు. ఎవ‌రి అనుమ‌తి లేకుండా ఎలా అక్ర‌మంగా బియ్యాన్ని త‌ర‌లిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

దీని వెనుక ఎవ‌రు ఉన్నారో తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఈ ర‌వాణాకు సంబంధించి కాకినాడ పోర్టు అధికారులే బాధ్య‌త వ‌హించాల‌ని హెచ్చ‌రించారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదల‌.

రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ ను ప‌ట్టుకున్నారు . మొత్తం 640 ట‌న్నుల బియ్యం ఉండ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండి ప‌డ్డారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు , నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.