ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా
నిర్మల్ జిల్లా – అవినీతి నిరోధక శాఖ దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు జూనియర్ అసిస్టెంట్. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని భూమికి సంబంధించిన సేత్వార్ ప్రతి, టోంచ్ చిత్రపటం జారీ చేసేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.10000/- లంచం డిమాండ్ చేశాడు జూనియర్ అసిస్టెంట్ జి. జగదీశ్.
నిర్మల్ పట్టణంలోని సర్వే, భూ దస్తావేజుల సహాయ సంచాలకుల కార్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. బాధితుడిని లంచం డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఇదే ఆఫీసులో పని చేస్తున్న అటెండర్ ద్వారా లంచం డబ్బులను తీసుకునే ప్రయత్నం చేశారు జూనియర్ అసిస్టెంట్ జగదీశ్. డబ్బులు తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఈ సందర్బంగా ఏసీబీ కీలక ప్రకటన చేసింది. ఎవరైనా సరే లంచం అడిగినా , ఇవ్వాలని వేధింపులకు గురి చేసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని సూచించింది ఏసీబీ.