క్రికెట్ అనలిస్ట్ వెంకట్ మలపాక కన్నుమూత
వెల్లడించిన ప్రముఖ అనలిస్ట్ సి. వెంకటేశ్
హైదరాబాద్ – ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత, విశ్లేషకుడిగా పేరు పొందిన వెంకట్ మలపాక కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. క్రీడా పరంగా తీరని లోటుగా పేర్కొన్నారు ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత, విశ్లేషకులు సి. వెంకటేశ్ . ఈ విషయాన్ని ఆయన ముఖ పుస్తకం వేదికగా పంచుకున్నారు.
వెంకట్ మలపాక ఇక లేరన్న విషయం చెప్పేందుకు తనకు మనసు రావడం లేదన్నారు. ఇద్దరం చాలా మ్యాచ్ లకు వ్యాఖ్యతలుగా ఉన్నామని తెలిపారు. ఆయనతో పంచుకున్న క్షణాలు మరిచి పోలేనివంటూ పేర్కొన్నారు.
మామూలుగా చాలా ఫిట్ గా ఉండే వెంకట్ మలపాక ఆరోగ్యం గత కొద్ది కాలంగా బాగా దెబ్బ తిన్నదని అన్నారు. ఇద్దరం కలిసి ఎన్నో టీవీ షోస్ చేశామని వెల్లడించారు సి. వెంకటేశ్. ముఖ్యంగా కోవిడ్ రోజుల్లో చెన్నై లోని ఒక హోటల్లో ‘బబుల్ ’ అనే ఓ బంధిఖానాలో ఉండి 1920-21 ఇండియా అస్ట్రేలియా సీరిస్ కలిసి కామెంటరీ చేయడం ఒక తీపి గురుతుగా మిగిలి పోతుందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.