దమ్ముంటే చర్చకు రావాలి – ఆర్ఎస్పీ
కాంగ్రెస్ సర్కార్ కు బిగ్ ఛాలెంజ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే తనతో గురుకులాలపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద గురుకుల విద్యార్థులు ఓ వైపు పిట్టల్లా రాలి పోతుంటే పట్టించు కోకుండా నిరాధారమైన విమర్శలు చేయడం తగదన్నారు.
బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. ఎవరి జీవితం ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
తాను కష్టపడి ఐపీఎస్ అయ్యానని, ఈ స్థాయికి వచ్చినా ఏ రోజు ఎవరికీ సలాం కొట్ట లేదన్నారు. ఇంకోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.