NEWSANDHRA PRADESH

ప్ర‌జా ధ‌నం స‌ల‌హాదారుల పాలు

Share it with your family & friends

స‌జ్జ‌ల కోసం రూ. 140 కోట్ల ఖ‌ర్చు

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆనాటి రాజ ద‌ర్బార్ ను త‌ల‌పింప చేస్తోంద‌న్నారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ మీడియాతో మాట్లాడారు.

ఎవ‌రి కోసం స‌ల‌హాదారుల‌ను నియ‌మంచారో జ‌గ‌న్ రెడ్డి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. వీరి వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఏమైనా లాభం చేకూరిందా అని ప్ర‌శ్నించారు. ఒక్క స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కోసం పెట్టిన ఖర్చు ఏకంగా రూ. 140 కోట్లు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అస‌లు ఎంత మంది ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఉన్నార‌నే విష‌యం ఏపీ సీఎంకు తెలుసా అని మండిప‌డ్డారు మ‌నోహ‌ర్. వీరి జీత భ‌త్యాల‌ను ఏ ప‌ద్దు కింద చెల్లిస్తున్నారో వెల్ల‌డించాల‌ని అన్నారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌జా ధ‌నాన్ని స‌ల‌హాదారుల పాలు చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏ అర్హ‌తలు ఉన్నాయో, ఎలాంటి అనుభ‌వం క‌లిగి ఉన్నారో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే విధంగా ఎలాంటి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారో చెప్పాల‌న్నారు మ‌నోహ‌ర్.