కూటమి సర్కార్ కరెంట్ షాక్
రూ. 7,912 కోట్ల అదనపు భారం
అమరావతి – ఏపీ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రజలపై భారీ భారం మోపేందుకు సిద్దమైంది. ప్రజలకు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు ఏపీ ఈఆర్సీ ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ. 9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది.
యూనిట్ కు 92 పైసల చొప్పున డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేసేందుకు లైన్ క్లియర్ చేసింది. దీని కారణంగా ప్రజలపై దాదాపు రూ. 7,912 కోట్ల అదనపు భారం పడనుంది.
ఇక రూ.9,412 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ రూ.1,500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు మిగతా డబ్బులు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా అధికారంలోకి రాక ముందు ఏపీ కూటమి సర్కార్ ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం మోపేది లేదంటూ హామీ ఇచ్చింది.
కానీ పవర్ లోకి వచ్చాక మాట మార్చడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసేసుకుంటే ఎలా అని మండిపడుతున్నారు.