ఏపీలో బీజేపీ సభ్యత్వం 25 లక్షలు
పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఏపీలో 25 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. శనివారం విజయవాడలో సంఘటన్ పర్వ్ -2024 రాష్ట్ర స్థాయి కార్యశాల కార్యక్రమం జరిగింది .”బలమైన బీజేపీ… వికసిత్ భారత్” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, సోము వీర్రాజు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 11 మంది సభ్యత్వం పూర్తయిందన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. కార్యకర్తలు, నేతల అంకిత భావంతో పని చేయడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. అలాగే పారదర్శకంగా సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
బీజేపీకి దేశ వ్యాప్తంగా సానుకూల స్పందన ఉందన్నారు. దేశానికి సుపరిపాలన అందించటంలో, అవినీతి కి చోటు లేకుండా పరిపాలన అందించటంలో ప్రజలు గమనించారని చెప్పారు పురంధేశ్వరి.
హర్యానాలో, మహారాష్ట్ర లో కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించడం జరిగిందన్నారు.
జార్ఖండ్ లో 33శాతం ఓట్ శాతం పెరిగిందన్నారు. ప్రజలు బీజేపీ ని స్వాగతిస్తున్నారని అన్నారు బీజేపీ చీఫ్. మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ స్వాగతించారని చెప్పారు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయగలిగామని పేర్కొన్నారు.