పెన్షన్లతో భరోసా పేదలకు ఆసరా
ఏపీ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – తమ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఠంఛనుగా ఇంటి వద్దకే వచ్చి భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
1వ తేదీ ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు లబ్దిదారులకు అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సందర్బంగా విజయనగరం జిల్లా నెలిమర్లలో పెన్షన్లను వృద్దులకు, లబ్దిదారులకు పంపిణీ చేశారు వంగలపూడి అనిత.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసిందని ఆరోపించారు. వృద్దులు, లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దీనిని గమనించిన తమ నాయకుడు , సీఎం చంద్రబాబు దానికి మంగళం పాడారని చెప్పారు వంలపూడి అనిత.
తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ , ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు.