NEWSTELANGANA

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి

Share it with your family & friends

ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించాలి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ ఎల్పీ చీఫ్ గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం నందిన‌గ‌ర్ నివాసంలో పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతి కాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించిన ఘ‌న‌త మ‌న‌దేన‌న్నారు. దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశా నిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మ‌ల్లా రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల‌ కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు పార్టీ శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.