మోడీ..కేసీఆర్ కు సీఎం సవాల్
రుణ మాఫీకి రూ. 2,747.67 కోట్లు విడుదల
హైదరాబాద్ – తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు పండుగ సందర్బంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పంట రుణమాఫీ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రుణమాఫీకి రూ.2,747.67 కోట్లు విడుదల చేశామన్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని ఆరోపించారు.
. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు సీఎం. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పాలని నిలదీశారు రేవంత్ రెడ్డి.
10 ఏళ్ల పాటు లక్ష రుణమాఫీ చేస్తామని నాలుగు దఫాల్లో కూడా చేయలేక పోయారని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో రుణమాఫీ వడ్డీ పెరిగి పోయిందన్నారు… ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే 18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.