NEWSTELANGANA

రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం

Share it with your family & friends

ఎన్ డీబీ డీజీ పాండియ‌న్ హామీ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి పూర్తిగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు
న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డి జె పాండియన్ . అంబేద్క‌ర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు.

ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసి రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కి ప్రణాళికలు వేసినట్లు చెప్పారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం దీని ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం క‌లిగించే విధంగా ఈ ప్రాజెక్టును చేప‌ట్టనున్న‌ట్లు పేర్కొన్నారు సీఎం.

పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హైదరాబాద్ లోని రెండవ దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, రాష్ట్రంలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటు కు సహకరించాలని పాండియ‌న్ ను కోరారు. హాస్పిటల్స్ నిర్మాణానికి, విద్యా సంస్థల హాస్టల్ బిల్డింగ్స్ , గృహ నిర్మాణాల‌కు సాయం చేయాల‌ని విన్న‌వించారు.

ఈ సంద‌ర్బంగా డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పాండియ‌న్ స్పందించారు. సానుకూల‌త‌ను వ్య‌క్తం చేశారు. రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని భ‌రోసా ఇచ్చారు.