DEVOTIONAL

టీటీడీ స్విమ్స్ కు రూ. 50 ల‌క్ష‌ల విరాళం

Share it with your family & friends

జీన్ అండ్ బోమ‌ని దుబాస్ ఛారిటీ ట్ర‌స్టు

తిరుమ‌ల – భ‌క్తుల‌కు విశిష్ట సేవ‌లు అందిస్తోంది టీటీడీ. విద్య‌, వైద్యం, వ‌స‌తి సౌక‌ర్యాల ఏర్పాటులో కీల‌క పాత్ర పోషిస్తోంది. అంతే కాకుండా హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా దేశ వ్యాప్తంగా హిందూ ధ‌ర్మ ప్రాశ‌స్త్యాన్ని తెలియ చేసే ప‌నిలో బిజీగా ఉంది. ఇదే స‌మ‌యంలో కోట్లాది మంది భ‌క్తులు క‌లియుగ వైంకుఠ‌నాథుడై శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని కొలుస్తారు. ఆయ‌న‌ను న‌మ్ముకుంటే ఎంత‌టి కోరికైనా తీరుతుంద‌ని భ‌క్తుల విశ్వాసం.

భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో విరాళాల‌ను అంద‌జేస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన జీన్ అండ్ బోమని ఎ దుబాష్ ఛారిటీ ట్రస్ట్ భారీ విరాళాన్ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ట్ర‌స్టు ప్ర‌తినిధి చంద్ర‌శేఖ‌ర్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో) జె. శ్యామ‌ల రావుకు రూ. 50 ల‌క్ష‌ల చెక్కును టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా గతంలో కూడా ఈ ట్రస్ట్ వివిధ సందర్భాలలో స్విమ్స్‌కు ఏడు కోట్ల రూపాయల‌ను విరాళంగా అందించింద‌ని వెల్ల‌డించారు ఈవో. భారీ విరాళాన్ని అంద‌జేసినందుకు ట్ర‌స్టును, ప్ర‌తినిధిని అభినందించారు శ్యామ‌ల రావు.