జో రూట్ సచిన్ రికార్డ్ బ్రేక్
నాలుగో ఇన్నింగ్స్ లో అధిక రన్స్
ఇంగ్లండ్ – మోస్ట్ ఫెవరబుల్ ఇంగ్లీష్ క్రికెటర్ గా గుర్తిపు పొందిన జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు జో రూట్.
గతంలో 1625 పరుగులు చేసిన రికార్డ్ సచిన్ టెండూల్కర్ పై ఉండేది. దానిని ఇవాళ జో రూట్ అధిగమించాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు జో రూట్. కాగా కీవీస్ ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది.
ఇదిలా ఉండగా క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో జో రూట్ 23 పరుగులు చేశాడు..ఈ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. సచిన్ ఈ ఘనతను 60 ఇన్నింగ్స్ లలో సాధించగా జో రూట్ మాత్రం కేవలం 49 ఇన్నింగ్స్ లలోనే సాధించడం విశేషం.
ప్రస్తుతం జో రూట్ 150 టెస్టులు ఆడాడు. 12,777 రన్స్ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో తను 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.