తృతీయ ఫైన్ అధినేత కాంతి దత్ అరెస్ట్
జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్న ఖాకీలు
హైదరాబాద్ – మోసం, ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో పారిశ్రామికవేత్త తృతీయ ఫైన్ జ్యువెలరీ ఫౌండర్ కాంతి దత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తృతీయ కో ఫౌండర్ శ్రీజా తిప్పాల ఆరోపణలతో సహా ఈ ఏడాది ప్రారంభంలో అనేక కేసులు ఆయనపై నమోదయ్యాయి.
కాంతి దత్ సెలబ్రిటీలనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ మోసానికి పాల్పడుతూ వచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. తప్పించుకు తిరుగుతున్న దత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాంత్ దత్ తన విద్యార్హతలను ఫోర్జరీ చేసి, తనను కంపెనీ డైరెక్టర్‌గా తొలగించి, ఆమె స్థానంలో తన తల్లిని నియమించారని తిప్పలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇండియా యాక్సిలరేటర్ (IA) నుండి వచ్చిన ఆరోపణలతో దత్ చుట్టూ ఉన్న వివాదం తీవ్రమైంది. ఇది అతని మునుపటి వెంచర్ సస్టైన్‌కార్ట్‌కు సంబంధించిన ఆర్థిక డేటాను తప్పుగా సూచించిందని ఆరోపించింది.
తృతీయ ఫైన్ జ్యువెలరీలో తన పెట్టుబడిని బహిరంగంగా ప్రకటించారు నటి పరిణీతి చోప్రా. ఆమెతో పాటు సమంత రుత్ ప్రభు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తను చేసిన మోసాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.