DEVOTIONAL

చిన్న పిల్ల‌ల ఆప‌రేష‌న్లు స‌క్సెస్

Share it with your family & friends

టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి

తిరుమ‌ల – కొత్త ఆసుపత్రిని శ్రీ పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌ పేరిట చిన్న పిల్లలకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దనున్నామ‌ని వెల్ల‌డించారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి.

స్విమ్స్‌లో విజయవంతంగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన‌ట్లు పేర్కొంది. తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో జనవరి 18న‌ గుండె, లివర్‌, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని చెప్పారు.

ఏవీ ధ‌ర్మా రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల ప‌రిధిలోని సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమకుమార్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డార‌ని తెలిపారు. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతని తల్లిదండ్రులు మానవతా దృక్పథంతో అవయవ దానానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్విమ్స్‌ వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్న‌ట్లు చెప్పారు ఈవో ధ‌ర్మారెడ్డి.

స్విమ్స్ ఆసుప‌త్రిలో అవ‌య‌వ మార్పిడికి అవ‌స‌ర‌మైన అధునాతన వైద్య‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. స్విమ్స్ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించు కోవాల‌ని కోరారు.