జనవరి 8,9,10వ తేదీలలో నిర్వహణ
అమరావతి : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు. ఇదే క్రమంలో యోగాంధ్ర పేరుతో విశాఖలో రూ. 94 కోట్లు ఖర్చు చేసి సక్సెస్ చేశారు. భారీ ఎత్తున జనం యోగాంధ్రలో పాలు పంచుకున్నారు. తాజాగా మరో కీలకమైన భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కందుల దుర్గేష్. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేరకు ఆవకాయ్ పేరుతో ఏకంగా ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు మంత్రి .
సోమవారం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు అజయ్ జైన్, అమ్రాపాలి కాటా తో కలిసి కందుల దుర్గేష్ ఫెస్టివల్ కు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహితోత్సవంపై పలు అంశాలను వివరించారు కందుల దుర్గేష్. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి 8,9,10 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐ ల్యాండ్ లలో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. కాగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.






