ఆర్జీవీ గాయబ్ భయంతో పరార్
టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్
విజయవాడ – టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే రామ్ గోపాల్ వర్మ పారి పోయాడని అన్నారు . జగన్ సహకారంతో రెచ్చి పోయాడని, మార్ఫింగ్ ఫోటోలతో పైశాచిక ఆనందం పొందాడని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ లను కించ పరిచేలా మూవీస్ తీశాడని అన్నారు. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నాడని ఫైర్ అయ్యారు. దమ్ముంటే బయటకు రావాలని, పిరికిపంద లాగా పారిపోతే ఎలా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం సహకారంతో వర్మ ఇష్టం వచ్చినట్లు వాగాడని ధ్వజమెత్తారు. కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నాడని ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. దమ్ముంటే బయటకు రావాలని, తాను చేసింది కరెక్టు అంటూ చెప్పాలని అన్నారు.
వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని, ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వర్మ, జగన్ లు ఇద్దరూ ఒక్కటేనని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు.
తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా, నువ్వు కూడా నీ తల్లి, చెల్లిని కూడా బయటకు పంపేశావంటూ మండిపడ్డారు. వ్యూహం సినిమా తీసిన నిర్మాతను టీటీడీ బోర్డు సభ్యుడిని చేస్తావా అంటూ భగ్గుమన్నారు.