తిరుమల కాలేజీలకు అటానమస్ హోదా
టీటీడీ ఈవో ఏఈ ధర్మా రెడ్డి వెల్లడి
తిరుమల – తిరుమల తిరుమతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలలకు అటామనస్ వచ్చిందని తెలిపారు.
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదా లభించిందని వెల్లడించారు.
తద్వారా కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవడం వీలవుతుందని స్పష్టం చేశారు. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయని తెలిపారు ఏవీ ధర్మా రెడ్డి.
తిరుమల పుణ్య క్షేత్రానికి వచ్చే భక్త బాంధవులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పేర్కొన్నారు. త్వరలో ఈనెల 8 నుంచి శ్రీవారి ఆరాధనా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.