NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ కు ఊర‌ట కేసు వాయిదా

Share it with your family & friends

డిసెంబ‌ర్ 13కి వాయిదా వేసిన కోర్టు

ఢిల్లీ – వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. అక్ర‌మ కేసుల‌కు సంబంధించిన విచార‌ణ చేప‌ట్టింది . కేసు విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు జ‌గ‌న్ రెడ్డి త‌ర‌పు న్యాయ‌వాది.

తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదిలా ఉండ‌గా ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న జగన్ కేసుల పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ రెడ్డి ప‌లు కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేంద్రంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. అయితే కావాల‌ని త‌న‌ను ఇరికించేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని, ఇందులో ఎలాంటి వాస్త‌వం లేదంటూ ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌టించారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.

దీనిపై ఆయ‌న గ‌త కొంత కాలం నుంచీ న్యాయ పోరాటం చేస్తూ వ‌స్తున్నారు వైసీపీ బాస్.