DEVOTIONAL

పద్మావతి అమ్మ వారికి కానుకగా గొడుగులు

Share it with your family & friends

అందుకున్న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

తిరుచానూరు – తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా సోమ‌వారం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆధ్వ‌ర్యంలో శోభా యాత్ర ఘ‌నంగా జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా భ‌క్తులు కానుక‌లు స‌మ‌ర్పించారు అమ్మ వారికి. 7 గొడుగులు కానుకగా అందుకున్నారు టీటీడీ చైర్మ‌న్ తో పాటు జేఈవో వీర‌బ్ర‌హ్మం.

తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్ర‌తినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడుకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ‌ వాహనం రోజున ఈ ట్ర‌స్టు త‌ర‌ఫున‌ గొడుగులు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో 5 గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.