చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
కీలక అంశాలపై ప్రధానంగా చర్చ
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం మర్యాద పూర్వకంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సోమవారం ఉండవల్లిలో తన నివాసంలో కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. ప్రధానంగా ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పవన్ కళ్యాణ్ కొణిదల.
కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చకు వచ్చాయి. తన ఢిల్లీ పర్యటన విశేషాలను ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు, ఇంకా రాష్ట్రంలో మిగిలి పోయిన నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మరోవైపు మంత్రులు నాదేండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బియ్యం అక్రమ రవాణాకి సంబంధించి సమీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. దాదాపు రూ. 48 వేల కోట్లకు పైగా విలువ కలిగిన బియ్యం అక్రమ రవాణా జరిగినట్టు ఇటీవల జరిపిన తనిఖీల్లో బయట పడింది.