మండలిలో సమస్యలను ప్రస్తావిస్తా
పద్మశాలీలకు ఎమ్మెల్సీ కవిత భరోసా
హైదరాబాద్ – శాసన మండలిలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం పద్మశాలి సోదర సోదరీమణులతో కీలక సమావేశం జరిగింది.
ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కవిత. ఈ సందర్బంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు కవితకు. తాము గత కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విన్నవించారు.
అన్నింటిని మండలిలో ప్రస్తావిస్తానని, సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు పద్మశాలి సోదర సోదరీమణులకు కవిత. పద్మశాలిలు సాధ్యమైనంత వరకు నాణ్యమైన వృత్తి పనిని ఎందుకుంటారని, వారు నేసే వస్త్రాలు ఎంతో ఆకట్టుకుంటాయని తెలిపారు.
ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదిగేందుకు కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్సీ.