ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో ఆరా
సంతృప్తి వ్యక్తం చేసిన శ్యామల రావు
తిరుచానూరు – ప్రముఖ పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్బంగా ఈవో జె. శ్యామల రావు టీటీడీ కల్పించిన వసతి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.
వాహక గజ వాహన సేవ ఊరేగింపు ఘనంగా జరిగింది. ప్రత్యేక శ్రద్ధతో తిరుచానూరులో వార్షిక నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఏనుగుల దివ్య ఊరేగింపు సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఏర్పాట్లపై భక్తులతో ముచ్చటించారు.
టీటీడీ ప్రతి వాహనసేవ ముందు దీపాలంకరణ, పుష్పాలంకరణ, బారికేడింగ్, అన్నప్రసాదం, పారిశుధ్యం, ప్రత్యేకించి రంగురంగుల కళారూపాల ఏర్పాటుకు భక్తులు పెద్దపీట వేశారు.