శ్రీకాంతాచారి బలిదానం చరిత్రాత్మకం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో తన బలిదానంతో కోట్లాది తెలంగాణ గుండెలను కదిలించిన, తన అమరత్వంతో పోరాటానికి ఊపిరి పోసిన శ్రీకాంతా చారిని నాలుగున్నర కోట్ల ప్రజానీకం మరిచి పోదని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ఎక్స్ వేదికగా శ్రీకాంతాచారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు . కేసీఆర్ చేపట్టిన మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన ధీరుడు శ్రీకాంతాచారి అని పేర్కొన్నారు కవిత.
తెలంగాణ ఉన్నంత దాకా శ్రీకాంతాచారి బతికే ఉంటాడని అన్నారు. ఆయన చేసిన బలిదానం, ఆత్మార్పణం కోట్లాదని కదిలించిందని, రాష్ట్రం వచ్చేలా చేసిందన్నారు. ఇదిలా ఉండగా శ్రీకాంతాచారిది పేద కుటుంబం.
విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు వెంకటాచారి, శంకరమ్మ. 1986 ఆగస్టు 15న పుట్టాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఆ తర్వాత తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నాడు. వీరుడా నీ మరణం వృధా కాదు. నీకు జోహారులు అందజేస్తోంది తెలంగాణ సమాజం. నాలుగున్నర కోట్ల ప్రజానీకం.